Akshaya Patra పాత్ర
కర్ణాటక, బెంగళూరులోని 5 ప్రభుత్వ పాఠశాలల్లో 1500 మంది బాలలకు ఉచిత భోజనం అందించడానికి 2000 జూన్ నెలలో మధ్యాహ్న భోజన పథకాన్ని Akshaya Patra ఫౌండేషన్ ప్రారంభించింది. గడిచిన 15 ఏళ్లుగా భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, అనుబంధ సంస్థల సహకారంతో కొనసాగుతున్నఈ కార్యక్రమం అవధులను దాటి ఎంతో ఎత్తుకు ఎదిగింది. 19,039 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులకు ఈ సంస్థ ఉచితంగా భోజనం అందచేస్తోంది. భారతదేశంలోని 12 రాష్ట్రాలకు మరియు 2 యూనియన్ భూభాగాలు చెందిన 52 వంటశాలల్లో ఈ ఫౌండేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. Akshaya Patra ఫౌండేషన్ మధ్యాహ్న భోజనం పథకం(మూలం) నిర్వహిస్తున్న అతిపెద్ద ఎన్జీవోగా గుర్తించబడింది.
మధ్యాహ్న భోజనాన్ని సమకూర్చడంలో Akshaya Patra పాత్ర కేవలం పాఠశాలల్లో భోజనం పెట్టడానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ కార్యక్రమం ద్వారా ఆకలి కేకలనేవి లేకుండా నిర్మూలించడం, ప్రాథమిక విద్యను సార్వజనీనం చేయడం అనే రెండు క్లిష్టమైన సహస్రాబ్ది లక్ష్యాలను చేరుకోడానికి ఆ సంస్థ ప్రయత్నం చేస్తోంది.
‘భారతదేశంలో ఆకలి కారణంగా పిల్లలెవరూ విద్యకు దూరంకాకూడదు ’ అన్న తన విజన్ కోసం లాభాపేక్ష లేని ఈ సంస్థ పనిచేస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోడానికి Akshaya Patra ‘చదువు కోసం అపరిమిత ఆహారం’ సమకూరుస్తోంది. ఒక్కోసారి రోజు మొత్తానికి ఈ పరిపూర్ణమైన ఆహారమే వారికి ఏకైక పాష్టిక ఆహారానికి మూలమవుతోంది. కాబట్టి ఈ భోజనం ద్వారా ప్రతి విద్యార్థి లబ్ధి పొందేందుకు Akshaya Patra ఆ ప్రాంతానికి తగిన విధంగా పౌష్టికాహారాన్ని తయారు చేసి అందిస్తోంది. ఉదాహరణకు ఉత్తర భారతంలోని వంట గదులు రోటీలను అందిస్తే.. దక్షిణ భారతంలోని వంట గదులు అన్నం వడ్డిస్తాయి.
రెండు విభిన్న రకాలైన వంట గదుల నమూనాలను ఆ సంస్థ నిర్వహిస్తోంది – కేంద్రీకృతం మరియు వికేంద్రీకృతం
కేంద్రీకృత వంట గదులు చాలా పెద్ద మొత్తంలో వంటకు వినియోగిస్తారు. ఇక్కడ ఒకరోజులో దాదాపు లక్ష భోజనాలను సిద్ధం చేయవచ్చు. ఆ వంటశాలకు చుట్టపక్కల ఉన్న పాఠశాలలకు అక్కడి నుంచే భోజనాలు పంపుతారు. ఆ కేంద్రాలు సెమీ-ఆటోమేటెడ్ అయినందున వంటచేసే సమయంలో పరిశుభ్రంగా ఉంటుంది. కేంద్రీకృత వంటశాలల్లో వాడే టెక్నాలజీ మరియు పని విధానాన్ని. హార్వార్డ్ లాంటి (మూలం) ప్రముఖ యూనివర్సిటీల పాఠ్యాంశాల్లో పరిశోధన, అధ్యయన అంశంగా చేర్చారు.
భౌగోళికంగా కఠినమైన పరిస్థితులు, సరైన రోడ్డు సదుపాయం లేని ప్రాంతాలు, భారీ నిర్మాణాలకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో వికేంద్రీకృత వంటశాలల ఏర్పాటు ఆదర్శప్రాయమైనది. ఈ వికేంద్రీకృత వంట గదులు Akshaya Patra వంట గదుల నిర్వహణ విధాన పర్యవేక్షణ, సూచనల ఆధారంగా స్వయం సహాయక మహిళా సంఘాలు (ఎస్ హెచ్ జీ)లు నిర్వహిస్తాయి.
బాలల ఆరోగ్య రంగంలో పలు ప్రఖ్యాత సంస్థలు నిర్వహించిన సర్వే ప్రకారం, దేశ జనాభాలో 40 శాతం మంది 18 ఏళ్ల లోపు వారే ఉన్నారు. వీరిలో 50 శాతం కంటే తక్కువ మంది బడికి వెళ్లే పిల్లలు. ఆర్థిక, సామాజిక పరిస్థితుల వల్ల ఒకపూట భోజనం సంపాదించుకోవడానికి వీరు బలవంతంగా ఏదో పని చేయాల్సి వస్తోంది. పౌష్టికాహార లోపం, ఆకలి వల్ల విశ్వజనీన విద్య కూడా వెనకబడిపోయిందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రెండు కారణాల వల్ల బడిలో హాజరు శాతం పడిపోతోంది. వారి ప్రతిభపై ప్రభావం పడుతోంది. దీంతో, ప్రత్యేకంగా బాలికల విషయంలో స్కూల్ డ్రాపవుట్ శాతం పెరిగిపోతోంది. ఆకలితో ఉన్న పిల్లలు బడికి హాజరైనా ఆ ఆకలి వారి ప్రతిభపై ప్రభావం చూపుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పిల్లల చదువులో ఒక స్వచ్ఛంద సంస్థ పాత్ర పోషించడమే కాకుండా.. మధ్యాహ్న భోజన పథకం పిల్లల్ని బడికి రప్పించడంలో ఎంతో ఉపయోగపడుతోంది. వాళ్లు పనికి పోకుండా.. బడికి వచ్చేలా ప్రోత్సహమిస్తోంది. విశ్వజనీన ప్రాథమిక విద్య నందించడంలో ఈ కార్యక్రమం తన వంతు సహాయం చేస్తోంది.
ఇక నాణ్యత విషయానికి వస్తే, Akshaya Patra ఫౌండేషన్ రాజీపడే ప్రసక్తి లేదు. అవి కేంద్రీకృతమైనా, వికేంద్రీకృతమైనా ఆరోగ్యకరమైన వాతావరణానికి, పరిశుభ్రతకు Akshaya Patra వంట గదులు ప్రథమ ప్రాధాన్యమిస్తాయి. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ పనిని మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన జాతీయ నిర్దేశక, పర్యవేక్షక కమిటీ (ఎన్ఎస్ఎంసీ) గుర్తించింది.
ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం ద్వారా చేపట్టిన ఈ విజయానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేగాక దీన్ని అమలు చేయదగిన ఒక ఆదర్శనీయ భాగస్వామ్యంగా గుర్తిస్తున్నారు. ది గ్లోబల్ జర్నల్ గుర్తించిన టాప్ 100 ఎన్జీవోల్లో 23వ ర్యాంకు దక్కడం ద్వారా ఈ ఫౌండేషన్ కు విశ్వవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది.
The Akshaya Patra Foundation © 2017 Website Designed & Maintenance By Creative Yogi