Akshaya Patra — ఇతర కార్యక్రమాలు

మొదట్లో ఒక ప్రదేశంలోని 1,500 మంది పిల్లలకు చేరువైన మా కార్యక్రమాలు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పన్నెండు రాష్ట్రాల్లోని 51 వంటశాలల్లో 18 లక్షల మంది చిన్నారులకు చేరుతున్నాయి. పాఠశాలల నుంచి అనూహ్య స్పందన, మధ్యాహ్న భోజన పథకం కింద భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యం, దాతృత్వం కలిగిన మా దాతల న్యాయపరమైన మద్దతు వంటి కారణాలు ఇందుకు ఎంతో దోహదపడ్డాయి. తొలుత ఐదు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఆహారం అందజేయడంతో మొదలైన సంస్థ.. 15 ఏళ్లలో ఏకంగా 10 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఆహారం అందజేసే స్థాయికి ఎదిగింది.

మధ్యాహ్న భోజన పథకంతోపాటు ఈ కింద పేర్కొన్న పలు ఇతర భోజన కార్యక్రమాలను కూడా Akshaya Patra నిర్వహిస్తోంది. అవి:

  • అంగన్ వాడీ ద్వారా ఆహారం

  • గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఆహారం

  • ప్రత్యేక పాఠశాలల్లో ఆహార కార్యక్రమాలు

  • ఆర్థికంగా వెనుకబడినవారికి సబ్సిడీతో మధ్యాహ్న భోజనం

  • ఇంటి నుంచి పారిపోయి వచ్చిన పిల్లలకు ఆహారం

  • వృద్ధాశ్రమాల్లో ఆహార కార్యక్రమాలు

  • నిరాశ్రయులకు ఆహారం

  • విపత్తు సహాయ చర్యలు

పైన చెప్పిన కార్యక్రమాలతోపాటు కింద పేర్కొన్న సామాజిక కార్యక్రమాల దిశగా కూడా సంస్థ పనిచేస్తోంది:

  • తరగతుల తర్వాత ట్యూషన్లు

  • జీవన నైపుణ్య కార్యక్రమాలు

  • కమ్యూనిటీ ఆరోగ్య శిబిరాలు

  • ఉపకారవేతన కార్యక్రమాలు

  • ఆరోగ్య తనిఖీ శిబిరాలు

2025 నాటికి 50 లక్షల మంది చిన్నారులకు సాయం అందించాలన్న లక్ష్యాన్ని సాధించాలన్న కృత నిశ్చయంతో Akshaya Patra ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడం ద్వారా ‘‘ఆకలి కారణంగా భారత్ లోని ఏ చిన్నారీ కూడా విద్యను కోల్పోకూడదు’’ అనే మా విజన్ కు మరింత చేరువవుతాం. మా వాటాదారుల నిరంతర సహాయ సహకారాలతో, భారత్ లో తరగతి గదుల్లో ఆకలి కేకలను పూర్తిగా పారదోలే విషయంలో మేం కీలకపాత్ర పోషిస్తామని కచ్చితంగా చెబుతున్నాం.

Share this post

Note : "This site is best viewed in IE 9 and above, Firefox and Chrome"

`